తెలంగాణ

telangana

ETV Bharat / state

సుధాకర్ పీవీసీ పైపుల అధినేత మీలా కన్నుమూత - ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా సత్యనారాయణ

ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యాపేట మున్సిపల్​ ఛైర్మన్​గా కూడా మీలా పనిచేసి...తన సేవలందించారు.

పీవీసీ పైపుల అధినేత మీలా కన్నుమూత

By

Published : Jun 25, 2019, 5:55 PM IST

సూర్యాపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ మీలా సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మీలా...హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సూర్యాపేట సమీపంలో పీవీసీ పైపుల కంపెనీని ఏర్పాటు చేసి...పైపుల రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందారు. ఈ కంపెనీ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీలో కీలకనేతగా మీలా గుర్తింపు తెచ్చుకున్నారు.

మారుతీ విద్యానికేతన్ కరస్పాండెంట్​గా ఉన్న మీలా సత్యనారాయణ మృతికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రేపు సెలవు ప్రకటించాయి.

పీవీసీ పైపుల అధినేత మీలా కన్నుమూత

ఇవీ చూడండి:తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details