ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆత్మ గౌరవానికి, అహంభావానికి మధ్య జరుగుతున్న పోటీగా నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఆచార్య కోదండరాం అభివర్ణించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మార్నింగ్ వాకర్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆత్మ గౌరవానికి, అహంభావానికి మధ్య పోటీ: కోదండరాం - సూర్యాపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదండరాం
ఎమ్మెల్సీ ఎన్నిక నిరంకుశత్వానికి ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మధ్య సంఘర్షణ అని నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఆచార్య కోదండరాం అన్నారు. అటో ఇటో తెల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో మార్నింగ్ వాకర్లతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఆత్మ గౌరవానికి, అహంభావానికి మధ్య పోటీ: కోదండరాం
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా..ప్రశ్నించే గొంతును చట్టసభకు పంపేందుకు అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని పట్టభద్రులు జారవిడుచుకుంటే తెరాస ప్రభుత్వ పాలన వైఫల్యాలను బలపరిచినట్లే అవుతుందన్నారు. వెనకటి గడీల పాలన, పన్నుల విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారుకు పట్ట భద్రులు ఒక హెచ్చరిక చేయాలని కోదండరాం సూచించారు.
ఇదీ చూడండి :మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య