సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరాం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటి చేస్తున్న నేపథ్యంలో లాయర్లతో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమం కోసం లాయర్లు ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. ఉస్మానియా విద్యార్థులు జైలుకెళ్లిన సమయంలో వాళ్లకి సహాయం చేయడంలో లాయర్లు ప్రముఖ పాత్ర వహించారని పేర్కొన్నారు.
మనం ఆశించిన తెలంగాణ ఇది కాదు: కోదండరాం - లాయర్లతో భేటీ అయిన ప్రోఫెసర్ కోదండరాం
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటి చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం హుజూర్నగర్లో లాయర్లతో భేటీ అయ్యారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
![మనం ఆశించిన తెలంగాణ ఇది కాదు: కోదండరాం professor kodandaram comment on telangana This is not the we hoped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9959050-713-9959050-1608562064970.jpg)
మనం ఆశించిన తెలంగాణ ఇది కాదు: కోదండరాం
మనం కొట్లాడి తెలంగాణ తెచ్చాం.. మనం ఆశించిన తెలంగాణ ఇది కాదని కోదండరాం తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో... ఇప్పటివరకు ఏమీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. మనం ఆశించిన తెలంగాణ రావాలంటే అందరం కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఇదీ చూడండి :ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్