తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రియా సిమెంట్​ యాజమాన్యంపై సర్పంచ్ ఫిర్యాదు' - సూర్యాపేట జిల్లా తాజా సమాచార

పల్లె ప్రగతి పనుల నిర్మాణాలను ధ్వంసం చేసిన ప్రియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

priya cement managenment smashed dumping yard in surypeta dist
'ప్రియా సిమెంట్​ యాజమాన్యంపై సర్పంచ్ ఫిర్యాదు'

By

Published : Nov 25, 2020, 5:28 PM IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్లెప్రగతి పనుల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాలను ప్రియా సిమెంట్​ యాజమాన్యం అడ్డుకుంది. గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, ప్రకృతివనాల నిర్మాణాలను ధ్వంసం చేసింది.

ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ మల్లిఖార్జునరావు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సిమెంట్​ పరిశ్రమ యాజమాన్యం తీరుకు నిరసనగా పంచాయతీ అధికారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'రాష్ట్ర పథకాల్లో అధికశాతం కేంద్రం భాగస్వామ్యంతోనే అమలు'

ABOUT THE AUTHOR

...view details