సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆరో రోజు రిలే నిరాహారదీక్షలో భాగంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వెయ్యి పోస్ట్ కార్డులను పంపారు. తద్వారా తమ పరిస్థితిని ఆయనకు వివరించారు.
వినూత్న రీతిలో ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరసన - వినూత్న రీతిలో ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన
సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేటు ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు వినూత్న రీతిలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. సుమారు వేయి పోస్ట్ కార్డులను సీఎం కేసీఆర్‌కు పంపించి తమ దీనావస్థను వివరించారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన
బార్లు, సినిమా థియేటర్లలో లేని కరోనా కేవలం విద్య సంస్థలకు మాత్రమే వచ్చిందా? అని ప్రైవేటు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు తమను నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు నిరాహారదీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షకు పలు రాజకీయ సంఘాలు మద్దతు తెలిపాయి.
ఇదీ చదవండి:రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన