సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో ప్రైవేటు టీచర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేసి ప్రైవేటు టీచర్లను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ రాజీవ్ చౌరస్తా వద్దకు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ టీచర్లు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో పట్టణంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ప్రైవేటు టీచర్ల ఆందోళన.. ఆదుకోవాలని ఆర్డీవోకు వినతి - private teachers protest at kodada latest news
కరోనా ఉద్ధృతి కారణంగా మరోసారి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీనితో పాఠశాలలు మూసివేసి తమ బతుకులను రోడ్డుపడేశారని.. ప్రైవేటు టీచర్లు ఆందోళన చేపట్టారు.
ప్రైవేటు టీచర్ల ఆందోళన.. ఆదుకోవాలని ఆర్డీవోకు వినతి
బార్లకు, సినిమా థియేటర్లకు లేని నిబంధనలు పాఠశాలలకు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్డౌన్ సమయంలో ఏ పనికి వెళ్ల లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ప్రభుత్వం ఇప్పుడు మరోసారి రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.