సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాని బైరు సతీష్ మోదీకి గుడి కట్టారు. గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి భాజపా నాయకులు బొబ్బా భాగ్యారెడ్డి, ముస్కుల చంద్రారెడ్డి, దేనుమకొండ రామరాజు, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మోదీ జన్మదినం సందర్భంగా గుడికట్టిన అభిమాని - ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
ప్రధాని మోదీపై అభిమానంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని మోదీకి గుడికట్టారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అన్నిరంగాల్లో దూసుకెళ్తోందని భాజపా నాయకులు అన్నారు.
మోదీ జన్మదినం సందర్భంగా గుడికట్టిన అభిమాని
నరేంద్ర మోదీపై అభిమానంతో గుడి నిర్మించిన బైరు సతీష్‌ను భాగ్యారెడ్డి అభిమానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. మరో ఇరవై నుంచి ముప్పై ఏళ్లు మోదీ ప్రధానిగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు