కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మాస్కులకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా చేసుకుని మెడికల్ షాపు వ్యాపారులు మాస్కులకు విపరీతమైన రేటు పెంచారు. దానితో కొంతమంది టైలర్లు మాస్కులు తయారు చేసి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు.
గుడ్డతో మాస్కుల తయారీ.. - కరోనా వైరస్ వ్యాప్తి నివారణ
కరోనా కారణంగా మాస్కులకు అధిక డిమాండ్ ఉన్నందున.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని టైలర్లు మాస్కులు తయారు చేసి ఒకొక్కటి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
![గుడ్డతో మాస్కుల తయారీ.. preparation-of-cloth-masks-in-suryapet-district-huzurabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6669665-211-6669665-1586076387863.jpg)
గుడ్డతో మాస్కుల తయారీ..
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వాటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. బయట 150 రూపాయలు అమ్ముతున్న మాస్కును మేము 20 రూపాయలకు అందిస్తున్నామని టైలర్లు అంటున్నారు. మాస్కుల వల్ల తమకు కొంత ఉపాధి దొరికిందని చెప్తున్నారు.
గుడ్డతో మాస్కుల తయారీ..
ఇదీ చూడండి:'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం