సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో కొలువై ఉన్న స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు పూజలు చేశారు. అక్కడున్న పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారు జామునుంచే అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
మేళ్లచెరువులో నాగుల చవితి పూజలు - నాగుల చవితి వార్తలు మేళ్ల చెరువు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో నాగుల చవితి సందర్భంగా భక్తులు పూజలు చేశారు. మహిళలు, చిన్నా.. పెద్ద అందరూ పుట్ట వద్దకు చేరుకొని పుట్టలో పాలు, పండ్లు, పలహారాలు వేసి సమర్పించారు. నాగు పాముకు పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మేళ్లచెరువులో నాగుల చవితి పూజలు
మహిళలు, చిన్నా.. పెద్ద అందరూ పుట్ట వద్దకు చేరుకొని పుట్టలో పాలు, పండ్లు, పలహారాలు వేసి సమర్పించారు. నాగు పాముకు పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, దోషాలు ఉంటే తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇదీ చదవండి:భక్తి పారవశ్యం: మమ్మేలు నాగులమ్మ... చల్లంగ చూడమ్మా!