'ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి'
సూర్యాపేట జిల్లాలో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు చేరుతోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మాధవరం రిజర్వాయర్‌ను పరిశీలించారు. బరకత్ గూడెంలో రూ.32 లక్షలలో నిర్మిస్తున్న దేవాలయ ప్రహరీకి శంకుస్థాపన చేశారు. కోదాడలో నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.