సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని సూర్యాపేట జిల్లా పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహారావు అన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ ద్వారా వచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారావు పాల్గొన్నారు.
'సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది' - సూర్యాపేట జిల్లా పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహారావు తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ ద్వారా వచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోషణ్ అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారావు తెలిపారు.
'సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది'
ఈ కార్యక్రమం ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ చూపొచ్చని తుంగతుర్తి ప్రాజెక్ట్ సీడీపీఓ నాగలక్ష్మి అన్నారు. వారికి ఆకుకూరల ద్వారా పోషకాహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జీ.లక్ష్మి పుష్ప, చైల్డ్ లైన్ సూర్యాపేట టీం సభ్యులు, హాస్టల్ వార్డెన్లు, అంగన్వాడీ టీచర్ గురోజు రామ, అంజలి, చిన్నపాక అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.