సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై చనిపోయి ఉన్న గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన పోలీసులు - akupamula accident news
రోడ్డుప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనంలోనే క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి.. ప్రాణాలు నిలిపారు.
మానవత్వం చాటిన మునగాల పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనంలోనే క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ మోహన్, షేక్ జానీలను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: ఇంటింటి ఫీవర్ సర్వే గొప్ప కార్యక్రమం: ప్రశాంత్ రెడ్డి