సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ తండాలో కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
జానకి నగర్ తండాలో నిర్బంధ తనిఖీలు - latest news on corden search in janakinagar thanda suryapet district
సూర్యాపేట జిల్లా జానకినగర్ తండాలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జానకి నగర్ తండాలో నిర్బంధ తనిఖీలు
ఎస్పీ భాస్కరన్ ఆదేశాల మేరకు ఈ కట్టడి ముట్టడి నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పౌరులు తమ చుట్టుపక్కల జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. బాధ్యతాయుత పౌరునిగా మెలగాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని గ్రామస్థులకు సూచించారు. తనిఖీల్లో 120 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జానకి నగర్ తండాలో నిర్బంధ తనిఖీలు