ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వైద్యమందించి మానవత్వం ప్రదర్శించారు పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్. సూర్యాపేట జిల్లా మద్దిరాల క్రాస్‌రోడ్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి సోమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.
మానవత్వం చాటిన పోలీస్... క్షతగాత్రుడిని బైక్‌పై ఆస్పత్రికి తరలింపు - గాయపడిన వ్యక్తిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకుని మానవత్వం చాటుకున్నారు సూర్యాపేట జిల్లా మద్దిరాల పోలీస్ కానిస్టేబుల్. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలైన వ్యక్తికి వైద్యం చేయించారు. సకాలంలో 108 వాహనం రాకపోవడంతో తన బైక్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
క్షతగాత్రునికి వైద్య చేయించిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్
మొదట 108 వాహనానికి ఫోన్ చేయగా సమయానికి రాలేదు. దీంతో కానిస్టేబుల్ శ్రీనివాస్, దామోదర్ గౌడ్ తమ బైక్‌పై మద్దిరాలలోని సాయిబాలాజీ ఆస్పత్రికి తరలించి వైద్యమందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని మంచిమనసుతో ఆదుకున్న పోలీసుకు బాధితుని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు .