తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ అమలు.. ఏపీ సరిహద్దు​ మూసివేత - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో లాక్​డౌన్​ ను కఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసివేసి, ఇతర రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న తెలంగాణ చెక్ పోస్ట్ ను మూసివేయడంతో ఏపీ నుంచి వచ్చే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.

police closed Ramapuram Check Post
సూర్యాపేట జిల్లా రామాపురం చెక్​పోస్ట్​ మూసివేత

By

Published : May 12, 2021, 12:17 PM IST

లాక్​డౌన్​ అమలులో భాగంగా రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసి వేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఉన్న చెక్​ పోస్ట్​ను మూసివేసి ఏపీ నుంచి వచ్చే వాహనాలను ఆపేశారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలను, ఈ పాస్ ఉన్న వారిని అనుమతించి, మిగతా వారిని వెనక్కి పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఏపీ నుంచి తక్కువ సంఖ్యలోనే వాహనాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పది రోజులు లాక్ డౌన్ ఉన్నందున ప్రయాణికులు తమతో సహకరించాలని కోరుతున్నారు. లాక్ డౌన్ అమలులో భాగంగా పోలీసు, రెవిన్యూ, ఆరోగ్య సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద విధులు నిరవహిస్తున్నారు. కొందరు ప్రయాణికులు లాక్​డౌన్ గురించి తెలియక ఇబ్బందులు పడ్డారు.

సూర్యాపేట జిల్లా రామాపురం చెక్​పోస్ట్​ మూసివేత

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details