cancer patient Swati charge on SI for One day : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్నాయక్ తండాకు చెందిన ధారావత్ చాంప్ల, బూబ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు స్వాతి.. ఆమెకు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని బలమైన కోరిక ఉంది. ఆ దిశగా తన అడుగులు వేస్తూ.. ఉన్నత చదువులు చదివి మంచి పోలీసు ఆఫీసర్గా స్థిరపడాలని కలలు కనేది. ఇంతలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతికి కామెర్ల వ్యాధికి గురైంది.
దాని ప్రభావంతో లివర్ చెడిపోయింది. అదికాస్తా ముదిరిఫ్రాంకియాసిస్ క్యాన్సర్కు దారితీసింది. దీంతో గత రెండేళ్లుగా క్యాన్సర్తో చావుబతుకుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతోంది. ఇప్పటికే మూడు ఆపరేషన్లు , ఆరు దఫాలు కీమో థెరఫీ జరిపించిన ఫలితం కనిపించ లేదు. వ్యాధిని నయం చేసేందుకు తల్లిదండ్రులు ఉన్నఎకరం పొలాన్ని అమ్మి సుమారు రూ. 25 లక్షల వరకు ఖర్చు చేశారు. ఉన్న ఆస్తులు, పొలాలు అమ్ముకున్న ఆ కుటుంబం పొట్టకూటి కోసం సూర్యాపేటకు వచ్చి కూలి పనులు చేస్తున్నారు.
- గతంలో క్యాన్సర్ బారినపడ్డ చిరంజీవి?.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!
- కుటుంబాన్ని మింగేసిన క్యాన్సర్ మహమ్మారి.. చనిపోయే ముందు రూ.2 కోట్ల ఆస్తిని దానం చేసిన మహిళ
Cancer patient swati story : కూతురు ఆరోగ్య పరిస్థితిని తట్టుకోలేని తండ్రి పక్షవాతానికి గురై మంచాన పడ్డారు. యుక్త వయస్సులో ఉన్న కుమార్తె క్యాన్సర్ సోకడం.. కుటుంబ పెద్దకు పక్షవాతం రావడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా తయరైంది. దీంతో స్వాతికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆమెలో ధైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెలో దాగి ఉన్న కోర్కెలను బయటకు రాబట్టగలిగారు. ఇందులో మొదటిది మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి భోజనం చేయాలని, రెండో కోర్కెగా ఒక రోజు పోలీసు అధికారిగా విధులు నిర్వహించాలని ఉందని చెప్పింది.