సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన బెజవాడ లక్ష్మీనారాయణ, బెజవాడ సైదులు గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి నిల్వ ఉంచారు. నిన్న అర్ధరాత్రి బియ్యాన్ని కర్ణాటక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నాలుగు ఆటోలు, ఒక బొలెరో, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి తెలిపారు.
రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు - latest crime news in suryapeta
లాక్డౌన్ వేళ సూర్యాపేట జిల్లా బేతవోలులో పోలీసులు భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 17 టన్నుల బియ్యంతోపాటు నాలుగు ఆటోలు ఒక బొలెరో, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు