గత నెల 10న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ఎక్కడికక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
సూర్యాపేట ఆరోగ్య శిబిరానికి స్పందన - కరోనా జాగ్రత్తలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో గత నెల కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి జిల్లా అధికారులు కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
http://10.10.50.85:6060/reg-lowres/15-May-2020/tg-nlg-63-15-helth-camp-av-ts10101_15052020181650_1505f_1589546810_150.mp4
వైద్య శాఖ ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగ పరుచుకుంటున్నారు. కనీసం రోజుకు యాభై మంది ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకుంటున్నారని జిల్లా అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం