తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిద్ర మత్తు వీడండి... ఆలయ భూములు కాపాడండి' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడాలని కోరుతూ దేవాలయ భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. కుంభకర్ణుడి వేషధారణలో ఉన్న వ్యక్తికి వినతిపత్రం అందించారు.

'నిద్ర మత్తు వీడండి... ఆలయ భూములు కాపాడండి'
'నిద్ర మత్తు వీడండి... ఆలయ భూములు కాపాడండి'

By

Published : Aug 13, 2020, 4:02 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహాపురంలోని శ్రీకోదండరామస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని దేవాలయ భూముల పరిరక్షణ సమితి ఆరోపించింది. భూములను పరిరక్షించాలని కోరతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కుంభకర్ణుడు వేషధారణలో ఉన్న వ్యక్తికి వినతిపత్రం అందజేశారు.

ఆలయ భూములను కొందరు సాగుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉందని చెప్పేందుకే కుంభకర్ణుడుకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:నిస్సహాయ స్థితిలో నిండు చూలాలు....

ABOUT THE AUTHOR

...view details