తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దగట్టుకు తరలిరండి - kodhada MLA bollam mallaiah

రెండేళ్లకోసారి ప్రతిష్ఠాత్మకంగా జరిగే దురాజ్​పల్లి పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకకు ముందు సంప్రదాయంగా నిర్వహించే దిష్టి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ క్రతువుకు కోదాడ ఎమ్మెల్యే హాజరయ్యారు.

పెద్దగట్టు జాతర

By

Published : Feb 11, 2019, 12:47 PM IST

లింగమంతుల పెద్దగట్టు జాతర
యాదవుల ఆరాధ్యదైవం రాజుపల్లి లింగమంతుల స్వామి జాతర ఈ నెల 24 నుంచి 3రోజుల పాటు జరగనుంది. ఈ వేడుకకు 15 రోజుల ముందు జరిగే దిష్టిపూజకు కోదాడ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. యాదవ భక్తులతో కలిసి వాయిద్యాలు వాయిస్తూ ఎమ్మెల్యే వారితో చిందేశారు. పెద్దగట్టుపై కొలువైన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 24 నుంచి జరిగే దురాజ్​పల్లి జాతరకు సీఎం కేసీఆర్​ను ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ తరువాత జరిగే రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టుకు పేరుంది. 4 రాష్ట్రాల నుంచి సుమారు 30లక్షల మంది ప్రజలు ఈ వేడుకకు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details