కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతును మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ... సూర్యాపేట జిల్లా కోదాడలో చేపట్టిన సంతకాల సేకరణకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి గ్రామంలోని రైతుల సంతకాలు సేకరించి... రాష్ట్రపతికి సమర్పిస్తామన్నారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయలేదని కేసీఆర్ను విమర్శించారు.
కాంగ్రెస్ పాలిత రాష్టం పంజాబ్లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు అనుకూల చట్టం చేసిందని గుర్తుచేశారు. సన్నరకం వరి సాగు చేయాలని రైతులను దారి మళ్లించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు మద్దతు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేశాడని ఏద్దేవా చేశారు. తక్షణమే వరికి రూ. 2,500ల మద్దతు ధర ప్రకటించాలని, పత్తిని రూ.5వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో లక్షల కోట్లను పేదల నుంచి దండుకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. నో ఎల్ఆర్ఎస్-నో టీఆర్ఎస్ నినాదంతో కాంగ్రెస్ ముందుకు పోతుందన్నారు.