సూర్యాపేట జిల్లా మెళ్లచరువు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామిని పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందించారు.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: ఉత్తమ్ - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించినట్లు పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మెళ్లచరువు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా వార్తలు
మేళ్లచెరువు శివాలయం రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరొందిందన్నారు. రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని కోరానన్నారు. ఏటా ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు మోసపోకుండా కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు.