తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే సైదిరెడ్డి - 'పరిసరాలను సైతం ఇళ్ళలాగా శుభ్రంగా ఉంచుకోవాలి'

ఇళ్లను ఎంత శుభ్రంగా ఉండేలా చూసుకుంటామో... పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి సూచించారు. సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వయంగా ఎమ్మెల్యే శ్రమదానం చేశారు.

'పరిసరాలను సైతం ఇళ్ళలాగా శుభ్రంగా ఉంచుకోవాలి'
'పరిసరాలను సైతం ఇళ్ళలాగా శుభ్రంగా ఉంచుకోవాలి'

By

Published : Jun 3, 2020, 2:50 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. స్వయంగా చెట్ల పాదులు తీసి... అనంతరం కాలువలు శుభ్రం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మంది యువత పట్టణ ప్రగతిలో పాల్గొనడం హర్షణీయమన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లను ఎంత శుభ్రంగా ఉండేలా చూసుకుంటామో... పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వివరించారు. వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గేల్లి అర్చన రవి, వైస్ ఛైర్మన్ నాగేశ్వరరావు, కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details