తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మవారి విగ్రహం అదృశ్యం.. కాసేపట్లోనే లభ్యం - ఫణిగిరిలో అమ్మవారి విగ్రహం అపహరణ

అమ్మవారి విగ్రహం అదృశ్యమై... అంతలోనే లభించిన ఘటన సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు వెతుకుతుండగా దేవాలయం సమీపంలోనే రోడ్డు పక్కన విగ్రహం దొరికింది.

parvathi devi idol missing and villagers recollct at phanigiri
అమ్మవారి విగ్రహం అదృశ్యం.. అంతలోనే లభ్యం

By

Published : Mar 17, 2020, 7:22 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి విగ్రహం అపహరణకు గురైంది. సోమవారం రాత్రి విద్యుత్ దీపాలు ఆర్పేసి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈరోజు ఉదయం గుడి ముందు ఆడుకుంటున్న పిల్లలు గుడి తెరిచి ఉండటం, విగ్రహం లేకపోవడం చూసి గ్రామస్థులకు సమాచారమిచ్చినట్టు పేర్కొన్నారు.

అమ్మవారి విగ్రహం అదృశ్యమైనట్టు గమనించిన ఆలయ ఛైర్మన్ పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులంతా బృందాలుగా ఏర్పడి గుడి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. వెతకడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే దేవాలయం సమీపంలోని రోడ్డు పక్కన విగ్రహం పడి ఉండడం గమనించారు. అప్పటికే ఆలయం దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు గ్రామస్థులకు సూచించారు.

అమ్మవారి విగ్రహం అదృశ్యం.. అంతలోనే లభ్యం

ఇదీ చూడండి:రైతు రుణమాఫీకి గ్రీన్​ సిగ్నల్​.. మార్గదర్శకాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details