తెలంగాణ

telangana

ETV Bharat / state

'నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్​కే ఓటెయ్యాలి' - PADMAVATHI REDDY ELECTION CAMPAIGN

హుజూర్​నగర్ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తున్నందున అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి పాలకీడు మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

'నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్​కే ఓటెయ్యాలి'

By

Published : Oct 18, 2019, 9:43 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ప్రచారం నిర్వహించారు. పాలకీడు మండలం జాన్ పహాడ్, కొత్త తండా, చెరువు తండా గ్రామాల్లో పర్యటించిన పద్మావతి రెడ్డి హస్తం గుర్తుకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కొత్త తండా గ్రామానికి లిఫ్టుల ద్వారా నీళ్లందించి కాంగ్రెస్ పార్టీ భూములను సస్యశామలం చేస్తుంటే... తెరాస అభ్యర్థి సైదిరెడ్డి మాత్రం గుర్రంబోర్డు తండాలో ఎస్టీల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్​కే ఓటెయ్యాలి'

ABOUT THE AUTHOR

...view details