తెలంగాణ

telangana

ETV Bharat / state

Block fungus: బ్లాక్​ ఫంగస్​తో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

బ్లాక్ పంగస్ తో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన మూరగుండ్ల ఉప్పలయ్య(57) శుక్రవారం మృతిచెందారు. పదిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడతూ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరగా వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

black fungus, died with black fungus,
బ్లాక్​ ఫంగస్​తో వ్యక్తి మృతి, బ్లాక్​ ఫంగస్

By

Published : Jun 26, 2021, 10:14 AM IST

బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతూ సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఓ వ్యక్తి మృతిచెందారు. మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మూరగుండ్ల ఉప్పలయ్య(57) నెల రోజుల క్రితం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే మందులు వాడుతూ కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

పదిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడతూ హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఫంగస్‌గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉప్పలయ్య శుక్రవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి: రైతు ఆందోళనల్లో ఉగ్రదాడి.. దిల్లీలో హై అలర్ట్​!

ABOUT THE AUTHOR

...view details