సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం ఎల్లపురంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడో వృద్ధుడు. ఆడుకుంటున్న చిన్నారి గ్రేప్ పై పెద్ద కోడయ్య కన్నేశాడు. మాయమాటలు చెప్పి బిస్కెట్లు కొనిచ్చి అంగన్ వాడీ కేంద్రం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని బాత్రూంలోకి పట్టుకెళ్లాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప చాలా సేపటి నుంచి కనిపించక పోవడం వల్ల తల్లిదండ్రులు వెతుకుతూ వచ్చారు. పాప ఏడుపు విని అంగన్వాడీ కేంద్రంలోని బాత్రూం వద్దకు వచ్చారు. విషయం గమినించి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పాపని ఆస్పత్రికి తరలించి, కామాంధుడిని పోలీసులకు అప్పగించారు.
8 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
అభం శుభం తెలియని చిన్నారికి బిస్కెట్ల ఆశ చూపి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో వృద్ధుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని ఎల్లపురంలో జరిగింది.
8 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
అత్యాచారయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని సీఐ హామీ ఇచ్చారు. నేరం నిర్ధారణ అయితే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని వెల్లడించారు.
ఇవీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా
Last Updated : Jul 9, 2019, 3:09 PM IST