సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో ఓ కుటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ వ్యక్తి మార్చి 15న ముంబైకి విమానంలో చేరుకున్నాడు. అక్కడి నుంచి డొమెస్టిక్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. తర్వాత నల్గొండలోని తన బంధువుల దగ్గర సోమవారం నుంచి గురువారం వరకు గడిపి శుక్రవారం ఉదయం సొంతూరైన నూతన్‌కల్‌కు చేరుకున్నాడు.
సౌదీ నుంచి వ్యక్తి రాక.. కుటుంబంతో సహా వైద్య పరీక్షలు - సూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లోని ఓ కుటుంబాన్ని కరోనా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. రెండేళ్ల క్రితం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి ఇవాళ ఉదయం సొంతూరుకు చేరుకున్నాడు. ఇది తెలిసి అప్రమత్తమైన అధికారులు మొత్తం కుటుంబాన్ని హైదరాబాద్‌కు పంపించారు.
సౌదీ నుంచి వ్యక్తి రాక.. కుటుంబంతో సహా వైద్య పరీక్షలు
ఈ వార్త అధికారుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే అప్రమత్తమై సదరు వ్యక్తి ఇంటికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో సహా అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.