తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్‌ కేసు - suryapet coronavirus updates

coronavirus
coronavirus

By

Published : Apr 5, 2020, 5:21 PM IST

Updated : Apr 5, 2020, 7:08 PM IST

17:19 April 05

సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

 సూర్యాపేట జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా తొలి బాధితుడి వల్లే... రెండో వ్యక్తికి వైరస్ సోకింది. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్​కు చెందిన యువకుడు... ఎంజీ రోడ్డులోని ఔషధ దుకాణంలో పనిచేస్తున్నాడు. తొలి పాజిటివ్ బాధితుడు మందుల కొనుగోలు కోసం దుకాణానికి రావడంతో... అందులో పనిచేసే వ్యక్తికి వ్యాధి సోకింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ధ్రువీకరించారు.  

ఔషధ దుకాణంలోని ఆరుగురితోపాటు మొత్తం 45 మంది రక్త నమూనాల్ని పరీక్షలకు పంపగా... అందులో 16 మంది నివేదికలు వచ్చాయి. 15 మందివి నెగెటివ్ కాగా... ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ 45 మందిని ముందుగానే అధికారులు... క్వారంటైన్​లో ఉంచారు. పాజిటివ్ వచ్చిన బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారి నమూనాల్ని పరీక్షల కోసం పంపుతున్నారు.  

Last Updated : Apr 5, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details