తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించాడట.. యువకునిపై ఫిర్యాదు - ప్రేమంటూ వచ్చాడు.. గర్భవతిని చేశాడు.. గాలికొదిలేశాడు

ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. ఎలాగూ పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదాని నమ్మి అమ్మాయి శారీరకంగా కలిసింది. గర్భం దాల్చితే అబార్షన్ చేయించాడని, ఇప్పుడు నాకొద్దంటూ వదిలేశాడని యువతి ఆరోపిస్తోంది.

victims
ప్రేమంటూ వచ్చాడు.. గర్భవతిని చేశాడు.. గాలికొదిలేశాడు

By

Published : Dec 13, 2019, 5:18 PM IST

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళి గూడెంకు చెందిన శ్యాం సుందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకొని గర్భవతిని చేశాడు. తన స్నేహితుడి సాయంతో అబార్షన్ కూడా చేయించాడు. తర్వాత మాట్లాడడం తగ్గించాడు. యువతి గట్టిగా నిలదీయడంతో నాకు నువ్వొద్దంటూ దూరం పెట్టాడు.

ఏం చేయాలో పాలుపోని యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పెద్దమనుషులతో మాట్లాడి తల్లిదండ్రులు శ్యాం సుందర్​ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమయింది. ఇక బతిమాలి కష్టమని యువతి పోలీసులను ఆశ్రయించింది. శ్యాం సుందర్ తనను ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఎలాగైనా సరే తనకు న్యాయం చేయాలంటూ వారిని వేడుకుంటోంది.

ప్రేమంటూ వచ్చాడు.. గర్భవతిని చేశాడు.. గాలికొదిలేశాడు

ఇవీ చూడండి: దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details