సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో పడి పవన్(30) అనే యువకుడు మృతి చెందాడు. రోజులానే సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన పవన్ చెరువులో విగతజీవిగా పడి ఉండడం స్థానికులు గమనించి బయటకు తీశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పవన్ లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. చేతికందిన కొడుకు చేజారిపోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరువులో పడి యువకుడు మృతి - crime news
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పెద్ద చెరువులో పడి పవన్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరువులో పడి యువకుడు మృతి