తనువు చాలించాడు కానీ... అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతని బంధువులు ఎవరో తెలియదు. ఫోటోను చూసి గుర్తించగలిగే బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై నవీన్ కుమార్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఫోటోలోని వ్యక్తి పేరు సత్యనారాయణ, వయస్సు 65 ఏళ్లు. సుమారు గత 3 సంవత్సరాల క్రితం చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామానికి బతుకుదెరువు కోసం ఒంటరిగా వచ్చాడు. గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటి హాల్ భవనంలో ఉంటూ గ్రామంలో జీవనోపాధి పొందుతూ జీవిస్తూ ఉండేవాడని ఎస్సై తెలిపారు.
ఇతని రక్త సంబంధీకులెవరో..? - death
ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎందరినో కలుస్తాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, చివరికి తనువు ఎక్కడ చాలిస్తామో తెలియదు.. ఇది మనిషి జీవితం. అలాంటి సంఘటనే ఇది.
ఇతని రక్త సంబంధీకులెవరో..?
సుమారు 15 రోజుల క్రితం ఈ వ్యక్తి అనారోగ్యంతో పడి ఉండగా.. గ్రామస్థులు గుర్తించి వెంటనే 108 ద్వారా హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం విషమించి గత నెల 29న మరణించడం జరిగిందని తెలిపారు. మృతదేహం అదే హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానాలోని మార్చురీలో ఉందని ఎస్సై నవీన్ వెల్లడించారు. ఎవరికైనా ఈ వ్యక్తి తెలిస్తే వారి బంధువులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: నెల రోజుల్లోనే ఒకే చెరువులో పడి ఇద్దరు మృతి