తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​ను ఢీ కొట్టిన కారు... ఒకరు మృతి - car and bike accident

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one man died in accident of car and bike in gandepalli mandal
బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి

By

Published : Jan 17, 2020, 11:05 AM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామం వద్ద బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన పొట్లూరి వెంకట్ రెడ్డిగా గుర్తించారు.

బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి
వెంకట్​ రెడ్డి పొలం రిజిస్ట్రేషన్ కోసం హుజూర్​నగర్​లోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్​నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details