సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హుజూర్‌నగర్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ బైపాస్ రోడ్, లక్కవరం వెళ్లే మార్గం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రసాద్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీ కొట్టింది.
కారు ఢీ కొట్టి వ్యక్తి దుర్మరణం - one man died
కారు ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
కారు ఢీ కొట్టి వ్యక్తి దుర్మరణం
కారు ఢీకొట్టగా... ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల కారు ఆచూకీ లభించలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.