ఆలయంలో నిద్ర చేయటానికి వెళ్తూ... రోడ్డు ప్రమాదం - ACCIDENT NEWS IN SURYAPET
దేవాలయంలో నిద్ర చేయటానికి వెళ్తున్న గిరిజనులు ప్రమాదానికి గురయ్యారు. ఆటో బోల్తాపడి ప్రమాదం జరగ్గా... ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా సుల్తానాపూర్ తండా వద్ద జరిగింది.
ONE MAN DIED IN AUTO ACCIDENT AT SULTHANPUR THANDA
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తానాపూర్ తండా వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దొనకొండ తండాకు చెందిన గిరిజనులు దేవాలయంలో నిద్రచేయడానికి ఆటోలో వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో సుల్తాన్పూర్ తండా వద్ద లారీని దాటించబోయి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా... మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిచగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.