తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2020, 1:12 PM IST

ETV Bharat / state

ఒక గంట ఎంపీడీవోగా బాధ్యతలు.. ఓ విద్యార్థినికి అవకాశం

ఓ సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రిని చూశాం.. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేటకు చెందిన ఓ విద్యార్థిని గంట సేపు ఎంపీడీవోగా విధులు నిర్వహించింది.

one hour mpdo chance got by a student in suryapet chilukuru
ఒక గంట ఎంపీడీవోగా బాధ్యతలు.. ఓ విద్యార్థినికి అవకాశం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా చిలుకూరు ఎంపీడీవో ఈదయ్య వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక విద్యార్థికి ఒక గంట తన బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మాధవి అనే విద్యార్థినికి ఒక గంట సేపు ఎంపీడీవోగా బాధ్యతలు అప్పగించారు.

ఒక్కసారిగా తనకు ఇంతటి అవకాశం ఇవ్వడం వల్ల విద్యార్థిని మాధవి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనకు అప్పజెప్పిన బాధ్యతను ఎంతో సమర్ధమంతంగా నిర్వహించింది. గంట సేపు తనలోని నాయకత్వ లక్షణాలను బయటకుతీసి.. పరిపాలనా దక్షత చూపిన తీరుకు మాధవిపై అధికారుల ప్రశంశలు కురిపించారు.

తాను భవిష్యత్తులో కలెక్టర్ అవుతానని చిన్నారి ఎంపీడీవో ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలోని ఓ జిల్లా కలెక్టర్ 7 రోజులపాటు ఓ విద్యార్థినికి పాలనాధికారిగా బాధ్యతలు అప్పగించడం చూసి.. మాధవికి ఓ గంట బాధ్యతలు అప్పగించానని ఎంపీడీవో ఈదయ్య పేర్కొన్నాడు.

ఒక గంట ఎంపీడీవోగా బాధ్యతలు.. ఓ విద్యార్థినికి అవకాశం

ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'వసుంధర' పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details