తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : ఎంపీడీవో శ్రీనివాస్​

నీటి పారుదల, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేసి... ఉపాధిహామీ కూలీలకు పని కల్పించాలని సూర్యాపేట జిల్లా నాగారం ఎంపీడీవో శ్రీనివాస్​ సూచించారు. నాగారం మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఇరు శాఖల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అధికారుల సమావేశం
అధికారుల సమావేశం

By

Published : Jun 18, 2020, 9:25 PM IST

ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు నీటి పారుదల, ఉపాధి హామీ అధికారులు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా నాగారం ఎంపీడీవో శ్రీనివాస్​ అన్నారు. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన ఇరు శాఖల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నీటి పారుదల, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నీటి పారుదల శాఖలోని మేజర్, మైనర్ కాలువల్లో కంప చెట్ల తొలగింపు, ఫీడర్ ఛానళ్లలో పూడిక తీయడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించవచ్చన్నారు. నీటి పారుదల శాఖలో పని చేసే ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపు బిల్లులను నరేగా ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఇదీ చదవండి:కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details