సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండలంలో వ్యవసాయ అధికారులు.. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని.. అధిక ధరలకు అమ్మితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తుంగతుర్తిలో విత్తనాల దుకాణాల్లో తనిఖీలు - సూర్యాపేట జిల్లా వార్తలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ జగ్గు నాయక్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో విత్తన దుకాణాల్లో తనిఖీలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు.
తుంగతుర్తిలో విత్తనాల దుకాణాల్లో తనిఖీలు