తెలంగాణ

telangana

ETV Bharat / state

రామారావు కుటుంబానికి అండగా ఉంటాం: ఉత్తమ్​ - లకావత్ రామారావు హైదరాబాద్​లోని గ్లోబల్ ఆస్పత్రిలో మృతి

లకావత్ రామారావు మృతిలో చింతలపాలెం మండల కాంగ్రెస్​ మంచి నాయకున్ని కోల్పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. ఆనారోగ్యంతో హైదరాబాద్​లోని గ్లోబల్ ఆస్పత్రిలో మృతి చెందారు.

obituary-to-congress-leader-rama rao-family
రామారావు కుటుంబానికి అండగా ఉంటాం: ఉత్తమ్​

By

Published : Aug 12, 2020, 3:00 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన కాంగ్రెస్​ నాయకుడు లకావత్ రామారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్​లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయన మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి అతని కుటంబసభ్యులను కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరామర్శించారు.

గిరిజన బిడ్డ రామారావు 1994 నుంచి నాకు మంచి మిత్రుడు. చిన్న వయసులో చనిపోవడం బాధాకరం. అతని కుటుంబానికి మేము, మా పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్​కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. చింతలపాలెం మండల కాంగ్రెస్ మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. కాలునొప్పి కారణంగా రామారావు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని​ తెలిపారు

ఇదీ చదవండి:కరోనా వేళ బడికి వెళ్లలేమంటున్న విద్యార్థులు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details