సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని 7 వార్డులో 150 మంది నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నటుడు జూ.ఎన్టీఆర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ వేముల నర్సయ్య సొంత ఖర్చులతో వంటింటి సామగ్రి పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్‌ను గౌరవించి ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇళ్ల విడిచి ఎవరూ బయటకు రావొద్దని కోరారు. తామంతా ఎన్టీఆర్ అభిమానులుగా సమాజానికి ఉపయోగపడే పనులను ఆచరిస్తామని స్పష్టం చేశారు.
150 మందికి సరకులు పంపిణీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ - 150 మందికి సరకులు పంపిణీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
సూర్యాపేట జిల్లాలో 150 మంది నిరుపేదలకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్‌ను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.
'ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలి'
TAGGED:
sarukulu pampini