తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రవాస భారతీయుడి దాతృత్వం - nri sharath chandra distributed rice at kukkadam

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో ప్రవాస భారతీయుడు శరత్‌ చంద్ర పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

nri-distributed-rice-at-kukkadam-suryapet
ప్రవాస భారతీయుడి దాతృత్వం

By

Published : May 2, 2020, 6:02 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో ప్రవాస భారతీయుడు వేముగంటి శరత్ చంద్ర పేదలకు రూ. 1.50 లక్షల విలువగల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామంలోని 220 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ చేతుల మీదగా అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని శరత్‌ను కొనియాడారు.

తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం అందించే రూ.1500 కుటుంబానికి సరిపోవడం లేదని, కనీసం రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గుండ్ల కొమరయ్య, ఎంపీటీసీ సభ్యుడు ముక్కాల అవిలయ్య, వేముగంటి విద్యాసాగర్ రావు, సుధాకర్ రావు, బానోత్ శ్రీను, మద్దెల భిక్షపతి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కదలనిమగ్గం... నిండని కడుపులు

ABOUT THE AUTHOR

...view details