సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వార్డువార్డుకీ తిరుగుతూ పండ్లు, కూరగాయలు ఆటోల్లో అమ్మేవారు. కానీ ఇప్పుడు వార్డులో ఒక్కచోటే ఆటో నిలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఎవరి ఇంటి ముందు ఆటోని నిలపడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ అయిపోతుందని.. కూరగాయల ఆటోలు ఆపడంలేదు - సూర్యాపేటలో మొబైల్ కూరగాయల ఆటోలు ఆగడం లేదు
ఇంటి ముందుకు వచ్చి కూరగాయాలు అమ్మే ఆటోలు ఆగడం లేదు.. వాటిని కొనేందుకు అందరం ఒకే చోట గుమిగూడాల్సి వస్తోంది. ఇదేంటని అని విక్రయదారులను అడిగితే డీజిల్ అయిపోతుందని చెబుతున్నారని సూర్యాపేట జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ అయిపోయిద్దని.. కూరగాయల ఆటోలు ఆగడంలేదు
దీనితో ప్రజలు గుంపులు గుంపులుగా ఆటో చుట్టూ చేరి కూరగాయలను కొంటున్నారు. వాడవాడల ఆటో తిరగడం వలన డీజిల్ అయిపోతుందనే కారణంతోనే వ్యాపారులు ఇలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి:మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్!