తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం - జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం

సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం కార్యాలయం వద్ద సిబ్బంది జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం వహించారు. త్రివర్ణ పతాకాన్ని మామూలు గుడ్డలాగా గోడపై వేశారు.

జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం

By

Published : Jun 11, 2019, 9:53 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో సిబ్బంది జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం వహించారు. ప్రతిరోజు జాతీయ జెండాను ఉదయాన్నే ఎగురవేసి సాయంత్రానికల్లా దించేవారు. కానీ ఈ రోజు త్రివర్ణ పతాకాన్ని దించే క్రమంలో మామూలు గుడ్డలాగా గోడపై వేసి వదిలేసారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా వారు ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ జెండాను నిర్లక్ష్యంగా వదిలివేసిన అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది.

జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details