సూర్యాపేట జిల్లాలో మరో కరోనా కేసు నమోదయింది. కొవిడ్-19 సోకి ఈ నెల 27న ప్రాణాలు కోల్పోయిన నాలుగు నెలల చిన్నారి మేనత్తకు వైరస్ సోకింది. ఇప్పటికే ఆమె ఐసోలేషన్లో ఉంది. చిన్నారి తల్లికి ఇంతకుముందే నెగెటివ్ వచ్చింది. సూర్యాపేట మండలానికి చెందిన చిన్నారి.. అనారోగ్యం పాలైనపుడు మేనత్తే సపర్యలు చేసింది. హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు కూడా ఆమె వెంట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుతో సూర్యాపేట జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 85కు చేరుకుంది. ఇప్పటికే 83 మంది డిశ్చార్జి కాగా... నాలుగు నెలల పసికందు మూడు రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు.
సూర్యాపేట జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు - సూర్యాపేట జిల్లా వార్తలు
రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. సూర్యాపేట జిల్లాలో మరొకరికి పాజిటివ్ నిర్ధరణయింది. కొవిడ్-19 సోకి ఈ నెల 27న ప్రాణాలు కోల్పోయిన నాలుగు నెలల చిన్నారి మేనత్తకు వైరస్ సోకింది.
సూర్యాపేట జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు