సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న 130 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. రూ. 1లక్ష 30వేల విలువ చేసే కొత్తబట్టలను కోదాడ మిత్రమండలి ఆధ్వర్యంలో కార్మికులకు ఎమ్మెల్యే అందజేశారు. గ్రామాలను, పట్టణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా నియంత్రణకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రజలందరూ గౌరవించాలని ఎమ్మెల్యే అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాల పంపిణీ - పారిశుద్ధ్య కార్మికులు
సూర్యాపేట జిల్లా కోదాడ మిత్రమండలి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నూతనవస్త్రాలను పంపిణీ చేశారు.
![పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాల పంపిణీ new cloths are distributed to the municipality workers by the mla bollam malliah in suryapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6727061-803-6727061-1586435359794.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ
మాసిన బట్టలతో రోజంతా పనిచేసే కార్మికులకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో వస్త్రాలను పంపిణీ చేశామని కోదాడ మిత్ర మండలి సభ్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక