తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో నందమూరి సుహాసిని ప్రచారం - NANDAMURI SUHASINI

హుజూర్​ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా తెదేపా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తరఫున నందమూరి సుహాసిని ఇంటింటి ప్రచారం చేశారు.

హుజూర్​నగర్​లో నందమూరి సుహాసిని ప్రచారం

By

Published : Oct 18, 2019, 9:42 AM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో హుజూర్​నగర్​ తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తరఫున నందమూరి సుహాసిని ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని, ఆర్టీసీ కార్మికుల పొట్ట కొడుతూ వారి చావులకు కారణమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. హుజూర్​ నగర్ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.

హుజూర్​నగర్​లో నందమూరి సుహాసిని ప్రచారం

ABOUT THE AUTHOR

...view details