ఆపద సమయంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
3 వేల లీటర్ల శానిటైజర్లు అందించిన ఎంపీ నామా
సూర్యాపేట జిల్లాకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తన ట్రస్టు నుంచి 3 వేల లీటర్ల శానిటైజర్లు, మాస్కులను అందించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అధికారులకు శానిటైజర్లు, మాస్కులు అందించారు.
3 వేల లీటర్ల శానిటైజర్లు అందించిన ఎంపీ నామా
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నామా ముత్తయ్య ఛారిటబుల్ ట్రస్ట్, మధుకాన్ ద్వారా 3 వేల లీటర్ల శానిరైజర్లు, 3 వేల మాస్కులు మంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణా రెడ్డికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అందజేశారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులే కాకుండా... ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలు వైరస్ నియంత్రణ నియమాలు తప్పక పాటించాలని ఎంపీ కోరారు.