తెలంగాణ

telangana

ETV Bharat / state

uttam kumar reddy: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే దళితబంధు'

హుజూరాబాద్​ ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్​ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​లో కాంగ్రెస్​పార్టీ మఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

uttam kumar reddy
uttam kumar reddy

By

Published : Jul 25, 2021, 4:56 PM IST

సూర్యాపేటజిల్లా హుజూర్​నగర్​లో కాంగ్రెస్​పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్​ ఆసమర్థత వల్లే కృష్ణా వాటర్​బోర్డు విషయం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. నీటి పంపకాల విషయంలో కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్​ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు.

హుజూరాబాద్​ ఉప ఎన్నికల కోసమే రాష్ట్రంలో దళితబంధు పథకం తీసుకొచ్చారని ఉత్తమ్​ విమర్శించారు. రాష్ట్రంలో 16 శాతం ఉన్న ఎస్సీల్లో కేవలం ఒక మంత్రి మాత్రమే ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోసం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో మండల గ్రామస్థాయి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, ప్రతిపక్ష నాయకులను బెదిరింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. పెగాసస్ టెలికాం సాఫ్ట్​వేర్​తో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తానని తెలిపారు.

రాష్ట్ర కేబినెట్​లో 17మంది మంత్రులుంటే కేవలం ఒక్కరే ఎస్సీ వర్గానికి చెందినవారా..? కేవలం హుజూరాబ్​ ఎన్నికల్లో గెలుపుకోసమే దళితబంధు పథకం తీసుకొచ్చారు. మూడెకరాల భూమి ఎంతమంది దళితులకిచ్చారు, డబుల్​బెడ్​రూం ఇళ్లు ఎంతమంది దళితులకిచ్చారో లిస్ట్​ ఇవ్వండి. రాష్ట్రంలో దళితబంధు అమలుచేయాలంటే సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి. అయితే ఈ బడ్జెట్​లోనే దానికి నిధులు కేటాయించి అప్పుడు మాట్లాడాలని ఎంపీగా డిమాండ్​ చేస్తున్నాను. పార్లమెంటులో పెద్ద చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం పెగసెస్​ సాఫ్ట్​వేర్​ ద్వారా ప్రతిపక్ష నాయకులు రాహుల్​గాంధీ, జర్నిలిస్టులపై నిఘా పెట్టింది. అదేవిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచే తెలంగాణలో ప్రతిపక్షాలపై, ఇతర సంస్థలపై టాపింగ్​ చేస్తున్నారు. ఇజ్రాయెల్​ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా టాపింగ్​ చేయడానికి సాఫ్ట్​వేర్​ తెచ్చుకుంది. స్వతంత్రంగా ఆలోచనచేసే ప్రజాస్వామ్యవాదులను తెలంగాణలో సీఎం కేసీఆర్​ ఇబ్బంది పెడుతున్నారు. ఈ అన్ని విషయాలను పార్లమెంటులో చర్చిస్తాను. ఉత్తమ్​కుమార్​ రెడ్డి, నల్గొండ ఎంపీ.

ఇదీ చూడండి:Corporation Loan : ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేస్తే.. మేకలు మంజూరయ్యాయి

ABOUT THE AUTHOR

...view details