'హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం'
త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆయన పర్యటించారు.
'హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం'
హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన మోడల్ కాలనీ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగిలిన 30 శాతం పనులను గత ఐదేళ్లుగా తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : ముందు చూపే.. ముంపు నుంచి కాపాడింది!