పల్లె ప్రకృతి వనాలతో మానవాళి అభివృద్ధి చెందుతుందని నాగారం వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో ఆమె మొక్కలను నాటారు.
పల్లెల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలతో భూగర్భజలాలు పెరుగుతాయని.. తద్వారా పంటలకు నీటి ఎద్దడి ఉండబోదన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం కరుణాకర్, తెరాస నాయకుడు కూరం వెంకన్న, ఈసీ మహేశ్, ఏపీవో లక్ష్మి పాల్గొన్నారు.
'ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించాలి' - సూర్యాపేట జిల్లా వార్తలు
సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలను వాటిని సంరక్షించాలన్నారు.

'ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించాలి'
ఇవీ చూడండి: అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన